హొలీ ల్యాండ్ (పరిశుద్ధ భూమి)నకు స్వాగతం

"శక్తిచేతనైనను బలముచేతనైనను కాక నా ఆత్మచేతనే ఇది జరుగును" - జెకర్యా 4:6.

మన మధ్యలో హొలీ ల్యాండ్(పరిశుద్ధ భూమి)ని నిర్మిస్తున్నవారు పరిశుద్ధాత్మ తండ్రి. ఇది పరలోకము నుండి వచ్చిన ఎందరో పరిశుద్ధులు పరలోక దర్శనాన్ని పొంది, ఆ పరమ తండ్రిలో నిమగ్నమయ్యే పరిశుద్ధ స్థలము. పరలోకము నుండి వచ్చిన ఎందరో ఈ భూమిపై లోకస్తులతో కలసి జీవన ప్రయాణం కొనసాగిస్తూ వుంటారు. వారికి తెలియనిది వారు పరలోకము నుండి వచ్చారని తమ పని ముగించి పరలొకములో చేరాలని. ఈ రహస్యము వారికి తెలిసేది "పరలోక దర్శనము" కలిగినప్పుడే. పరలోక దర్శనము కలిగే స్థలమే హోలీల్యాండ్(పరిశుద్ధ భూమి)."

మోషే 40 సంవత్సరములు ఐగుప్తు దేశములోనూ, 40 సంవత్సరములు మిద్యాను అరణ్యములోనూ సంచరించాకా 80 సంవత్సరముల వయస్సులో దేవుడు అతనిని మోషే! మోషే! అని పిలచి, నీవు నిలచినది హొలీ ల్యాండ్(పరిశుద్ధ భూమి) అని తెలిపి, పొదలో నుండి "పరలోక దర్శనాన్ని" ఇచ్చి ఇశ్రాయేలీయులకు నాయకునిగా పరమతండ్రి పనికి సిద్ధపరిచినది హోలీల్యాండ్(పరిశుద్ధ భూమి) నుండే. (నిర్గమ 3వ అద్యాయము)

పరలోకస్తుడైన యాకోబు తన జ్ఞానాన్ని నమ్మి పాలేరుగా మారాడు. ఎన్నో సంవత్సరములు ప్రయాసపడి ప్రాణభయంతో విసిగిపోయిన యాకోబుకు పరమ తండ్రి "పరలోక దర్శనాన్ని" ఇచ్చి భూమిపై నుండి పరలోకానికి నిచ్చెన చూపించాడు. యాకోబు ఇశ్రాయేలుగా మారాడు. ఆశీర్వదించబడిన జనాంగానికే మూలపురుషుడయ్యాడు. యాకోబు పరలోకదర్శనంతో ఇశ్రాయేలుగా మార్చబడిన స్థలమూ, పరలోకపు నిచ్చెన భూమిపై నిలిచిన స్థలమూ హొలీ ల్యాండ్(పరిశుద్ధ భూమి). (ఆదికాండము 28, 32 అధ్యాయములు)

మోషే చేతి క్రింద పనివాడు యెహోషువ. ఒక్కసారిగా ఇశ్రాయేలీయుల మీద నాయకుడిగా మార్చబడ్డ యెహోషువపై అన్యజనులను పారద్రొలి కానానును ఇశ్రాయేలీయులకు పంచవలసిన బాధ్యతను దేవుడే మోపాడు. భయంతో వణికిపోతున్న యెహోషువకు "పరలోక దర్శనము" కలిగింది. దేవునిదూత అతనితో నీవు నిలిచినది హొలీ ల్యాండ్(పరిశుద్ధ భూమి), భయపడవలసిన పనిలేదని చెప్పి ధైర్యపరచింది. ఆ పరలోక దర్శన స్థలమే హొలీ ల్యాండ్(పరిశుద్ధ భూమి). (యెహోషువ 3:13 నుండి 15 వరకు). బాబేలు నిర్మాణము పూర్తి కాలేదు. కారణం అది మానవ ఆలోచనా నిర్మితము. (ఆది 11:1 నుండి 9 వరకు). జెరుబ్బాబెలు పునాది వేసినా పని ఆగలేదు. కారణము అది పరిశుద్ధాత్మ తండ్రి జరిగించిన కార్యము. (జెకర్యా 4:6,7).

హొలీ ల్యాండ్(పరిశుద్ధ భూమి) నిర్మాణము మానవ శక్తి బలముల నిర్మితము కానేకాదు. పరిశుధ్ధాత్మ తండ్రియే దిగివచ్చి జరిగించుచున్న పరలోక దర్శన నిర్మితము, ఆద్యాంతము దైవ నిర్మాణము. హెవెన్ లైట్ మినిస్ట్రీస్ నకు చెందిన మేము, మా యొక్క విశ్వాసము దేవుని వాక్కు మీద ఆధారపడుతుంది. ఆదిలో దేవుడు చేసిన అనేక వాగ్దానాలలో ఏ ఒక్క వాగ్ధానము కూడా నిరర్ధకము కాలేదు. సాంకేతిక విప్లవం కొత్త పుంతలు తొక్కుతున్న ఈ దినములలో కూడా ఆయన చేసిన వాగ్దానాలను నెరవేర్చగల శక్తిమంతుడు. దేవుడు హొలీ ల్యాండ్(పరిశుద్ధ భూమి) నిర్మించియున్నాడు కనుక, మేము మరింత భక్తితో, మరింత ప్రార్థనతో, మరింత పరిశుద్ధతతో ఆ హొలీ ల్యాండ్(పరిశుద్ధ భూమి)లోనికి ప్రవేశించి ఆ పరమ తండ్రి ప్రసన్నతలో నిత్యమూ ఆనందించుచున్నాము.

హొలీ ల్యాండ్(పరిశుద్ధ భూమి) చిరునామా: హొలీ ల్యాండ్ (పరిశుద్ధ భూమి), డేగంపురం, గొల్లవానితిప్ప రోడ్, భీమవరం, పశ్చిమగోదావరి జిల్లా, ఆంద్రప్రదేశ్.

Route Map :

map-generator.net  

అద్భుత సాక్షాలు:

నా పేరు రాజ్ కుమార్. నేను హైదరాబాద్ లో నివశిస్తున్నాను. దేవుని కృప వలన నేను జులై 2014 న జరిగిన హొలీ ల్యాండ్ ప్రారంభోత్సవమునకు హాజరై తిరిగి హైదరాబాద్ చేరుకున్నాను. నేను గత కొంత కాలంగా తీవ్రమైన నడుము నొప్పితో బాధపడుతున్నాను. ఎందుకంటే అనేక సంవత్సరాలుగా నేను ఎక్కువగా కూర్చొని పని చేయటవలన నడుము నొప్పి తీవ్రముగా ఉంటుంది. డాక్టరు గారు నడుముకు సప్పొర్టు బెల్టు వాడమని చెప్పారు. ఒక రోజు నాకు కల వచ్చింది. ఆ కలలో నేను మరియు నా కుటుంబము ఒక చెరువులో నుండి బయటకు వస్తుండగా యెవరో ఒక వ్యక్తి పెద్ద ఘట సర్పమును చంపి ముక్కలుగా చేసారు. కల భావమును గూర్చి దైవజనులు హోసన్న గారిని అడుగగా, "దేవుడు హోలీ ల్యాండ్ లో పవిత్ర స్నానం ఆచరించమని చెప్పారు" అని అన్నారు. నేను, నా కుటుంబము భీమవరం వెళ్ళి. హోలీ ల్యాండ్ లో పవిత్ర స్నానము చేసాము. హోలీ ల్యాండ్ నుండి తిరిగి మా గృహమునకు వెళ్తూ మార్గమధ్యలో మందుల షాపు నకు వెళ్ళి నడుముకు సప్పొర్టు కొసం బెల్టు కొనుక్కొన్నాను. బెల్టు కొనుక్కున్నాను గానీ ఆ రోజు నడుముకు పెట్టుకోవటము మరచిపోయాను. ఆశ్చర్యకరముగా మరుసటి రోజు నా నడుము నొప్పి పూర్తిగా నయమైపోయింది. హోలీ ల్యాండ్ ను దర్శించే వారికి దేవుడు చేస్తున్న అద్బుత కార్యాలు చూసి నేను చాలా ఆనందిస్తున్నాను. ఆ స్థలమునందు పరమ తండ్రి వారు ఆసీనులై ఉన్నారని నేను కచ్చితముగా చెప్పగలను. ఈ స్థలమందు జరుగుచున్న అద్భుతాలు చూచినప్పుడు నాకు వెంటనే బైబిలు గ్రంధములోని మార్కు సువార్తలో చెప్పబడిన బెతెస్థ కోనెరు గుర్తుకు వచ్చింది. సాంకేతిక పరిజ్ఞానము అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో కూడా ఇటువంటి అద్బుతాలు జరగడం చూచి, మన దేవుడు ఆనాడు, ఈనాడు ఏక రీతిగా ఉన్న దేవుడని నాకు తెలిసింది. మీరు కూడా హొలీ ల్యాండ్ ను దర్శించి మేలులు పొందవలెనని ప్రేమతో విజ్ఞప్తి చెస్తున్నాను. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెందును గాక!!!